
ఇలా ఇటీవల కాలంలో లోన్ యాప్స్ వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప.. ఎక్కడ తక్కువ ముఖం పట్టడం లేదు అని చెప్పాలి. వెరసి ఇక ఈ వేధింపులు తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. మరి కొంతమంది ఇక లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక న్యాయం చేయాలంటు పోలీసులను ఆశ్రయిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇలా నకిలి లోన్ యాప్స్ పెరిగిపోతూ.. ఎంతో మందిని వేధింపులకు గురూ చేస్తున్న నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక గూగుల్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఎంతో మందికి లోన్ యాప్ నుండి వేధింపుల తిప్పలు తప్పనున్నాయి అని చెప్పాలి. నకిలీ లోన్ యాప్ ల ఆట కట్టించేందుకు కొత్త పాలసీని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది గూగుల్. ఇకపై ఎవరైనా సరే గూగుల్ ప్లే స్టోర్లో లోన్ యాప్లను ఉంచాలనుకుంటే మాత్రం.. వారు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వడంతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కస్టమర్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు కూడా వీలుండదు అని గూగుల్ స్పష్టం చేసింది. ఇక ఈ నిబంధన మే 31వ తేదీ నుంచి అమల్లోకి రానుంది అని చెప్పాలి.