
కోచ్ గా మారిన తర్వాత ఆశిష్ నెహ్ర కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు అంటూ సెహ్వాగ్ విమర్శించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో తరచూ ఆటగాళ్లతో మాట్లాడుతూ వారిని అనవసరమైన ఒత్తిడికి గురి చేస్తున్నాడు అంటూ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. గెలిచే మ్యాచ్లను గుజరాత్ చేజార్చుకుంది. అయితే ఇక రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో కోచ్ ఆశిష్ నెహ్ర పదేపదే ఆటగాళ్లతో మాట్లాడాడు.
స్ట్రాటజీ టైం వరకు ఆగకుండా బౌండరీ లైన్ వద్దకు వచ్చి ఆటగాళ్లతో మ్యాచ్ రివ్యూలను డిస్కస్ చేస్తూ వచ్చాడు అని చెప్పాలి. అయినప్పటికీ గుజరాత్ కి ఓటమి తప్పలేదు. అయితే ఇలా ఆటగాళ్లతో తరచూ మాట్లాడటాన్ని పై వీరేంద్ర సెహ్వాగ్ ఎక్కువగా తప్పుపట్టాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆటగాళ్లతో మాట్లాడాల్సిన అవసరం నెహ్రకు ఏముంది అంటూ ప్రశ్నించాడు. అతను ఫుట్బాల్ టీం కోచ్ కాదు అత్యుత్సాహం అవసరం లేదు అంటూ చురకలు అంటించాడు. చిన్నప్పటి నుంచి అతని చూస్తున్న.. అతనిలో ఉండే అత్యుత్సాహం నాకు తెలుసు. ఎంత హెడ్ కోచ్ అయినా మ్యాచ్ ప్రారంభమైతే డక్ అవుట్ లో కూర్చోవాల్సిందే. టీం చేస్తున్న తప్పిదాలను నోట్ చేస్తూ దానికి తగ్గ వ్యూహాలు రచించాలి. కానీ ఆశిష్ నెహ్ర బౌండరీ దగ్గర ఆటగాళ్లతో మాట్లాడటం వల్ల వారిలో ఒత్తిడి పెరుగుతుంది అంటూ వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్.