ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రత్యేకంగా తను అంటే పడి చచ్చే వాళ్ళు పాకిస్తాన్ లో బీభత్సముగా ఉన్నారు. కొందరు అమ్మాయిలు మ్యాచ్ జరుగుతున్న సమయంలో నన్ను పెళ్ళి చేసుకోండి అంటూ ప్లకార్డులు పట్టుకొని తెగ అభిమానం చూపిస్తారు. కేవలం సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీస్ లైన ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్స్ కూడా పెళ్ళి చేసుకో విరాట్ అంటూ అతని వెంట పడ్డారు. కొంతమందైతే మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే పోలీసు భద్రత వలయాలను, బారికేడ్లను దాటుకొని విరాట్ కోహ్లీ ని కలవడానికి మైదానంలోకి దూసుకొస్తుంటారు.


తాజాగా ఇలాంటి ఒక సంఘటనే ఇండోర్‌లో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ మూడో రోజున చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీకి వీరాభిమానైనా ఒక వ్యక్తి.. డ్రింక్స్ బ్రేక్‌లో కంచె దూకేశాడు. పరుగులు పెడుతూ మైదానంలోకి వెళ్లిపోయాడు. తన వీపు మీద వీకే అని.. 18 అని పెయింట్ చేసుకున్నాడు..విరాట్ కోహ్లీ వైపుగా వేగంగా పరిగెత్తుతూ.. వెళ్లి అతని కాళ్ళు పట్టుకున్నాడు. వెంటనే విరాట్ కోహ్లీ ఆ వీరాభిమానిని పట్టుకొని పైకి లేపాడు. ఇది గమనించిన అక్కడ సిబ్బంది హుటాహుటిన ఆ వీరాభిమానిని పట్టుకొని తీసుకెళ్తుంటే... కోహ్లీ.. 'అతన్ని ఏమీ అనొద్దనీ, లైట్ తీసుకోమనీ' అన్నాడు. దాంతో కోహ్లీకి తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమను కళ్లారా చూసిన ఆడియన్స్ ఫుల్ గా అరుస్తూ చప్పట్లు కొట్టారు.


ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కోహ్లీ ఆ వీరాభిమానిని కాపాడటంతో నెటిజన్లు బాగా కొనియాడుతున్నారు, మెచ్చుకుంటున్నారు. ఎంతమంది భద్రత సిబ్బంది ఉన్న ఇలాంటి సంఘటనలు ఇండియాలో తరుచుగా జాగుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాలలో క్రికెటర్స్ తో సహా ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడుతుంటారు. అకస్మాత్తుగా మైదానంలోకి అభిమానులు చొచ్చుకుపోతున్న ఆపలేని భద్రత సిబ్బందిని చాలా మంది విమర్శిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: