ప్రస్తుతం న్యూజిలాండ్ భారత్ మధ్య ఇండియా వేదికగా టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. టి20 ప్రపంచకప్ ముగియగానే నేరుగా భారత పర్యటనకు వచ్చింది న్యూజిలాండ్ జట్టు. ఈ క్రమంలోనే భారత పర్యటనలో భాగంగా ఇప్పటికే టీమిండియాతో టి20 సిరీస్ కూడా ఆడింది   టి20 సిరీస్ లో భాగంగా ఇక టీమ్ ఇండియా న్యూజిలాండ్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా శుభారంభం చేసింది. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతుంది.


  టెస్టు సిరీస్లో కూడా ప్రత్యర్థి న్యూజిలాండ్  జట్టుపై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది టీమిండియా. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్లో 49 పరుగుల ఆదిపత్యాన్ని  కలుపుకొని ఏకంగా 284 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్  జట్టు ముందు నిర్దేశించింది టీమిండియా జట్టు. ఈక్రమంలోనే ఇన్నింగ్స్ ప్రారంభించబోయే న్యూజిలాండ్ జట్టు ఎలా రాణించ బోతుంది  అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక టెస్ట్ మ్యాచ్ పై   ఇటీవల న్యూజిలాండ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 మేం గెలవాలి అంటే సానుకూలంగా ఉండాలి.. భారత్ ఆడిన తీరు నుంచి ఎంతగానో ప్రేరణ పొందాల్సిన అవసరం ఉంది.. వాళ్లు ఆడినట్లు తమ బ్యాట్స్మెన్లు కూడా aడాల్సి ఉంటుంది. రెండో ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్ల కదలికలు కీలకంగా మారిపోయాయి.  మేం కూడా అలాంటిదే చేసి పరిస్థితులను మాకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటున్నాము. వీలైనంత మేరకు గెలుపుకోసం కష్టపడాలి.. అలా చేస్తేనే పరుగులు వాటంతట అవే వస్తూ ఉంటాయి.  ఇక నాలుగో రోజు ఆటలో వికెట్లు తీసి భారత జట్టును ఒత్తిడి లోకి  నెట్టడం లో విఫలం అయ్యాము. ఐదో రోజు ఆటలో ఎలాంటి ఫలితమైన వచ్చే అవకాశం ఉంది ఎవరైనా గెలవవచ్చు లేదా మ్యాచ్ డ్రాగా కూడా ముగియవచ్చు అంటూ న్యూజిలాండ్ జట్టు కోచ్ లుక్ రాంచి  అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: