ఇక మీ బిల్లును సగానికి తగ్గించడానికి పవర్ సేవర్ పరికరం అందుబాటులోకి వచ్చింది.ఈ కొత్త పవర్ సేవర్ పరికరం ఆన్ లైన్ మార్కెట్ ఫ్లిప్ కార్ట్లో ఉంది. ఇది అమలైతే ఏకంగా 45 శాతం విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. ఈ పవర్ సేవర్‌ను ఫిక్స్ ద్వారా మీ నెలవారీ విద్యుత్ బిల్లు సగానికి తగ్గుతుందని MD Proelectra కంపెనీ చెబుతోంది.ఇక ఈ సేవర్ పేరు MD ప్రోఎలెక్ట్రా పవర్ సేవర్.ఇక ఎండీ ప్రొఎలెక్ట్రా పవర్ సేవర్‌ను ఏర్పాటు చేస్తే నెలవారీ విద్యుత్ బిల్లు ఏకంగా 45 శాతం తగ్గుతుందని ఎండీ ప్రొఎలెక్ట్రా కంపెనీ తెలిపింది. ఈ ఉత్పత్తి ఇప్పుడు మనకు ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్‌లో అందుబాటులో ఉంది. దీని ధర వచ్చేసి రూ.800. కానీ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ద్వారా ఇది రూ.589కి అందుబాటులో ఉంది. వీటితో పాటు కొన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి.ఈ పవర్ సేవర్ పరికరాన్ని కొన్న తర్వాత..ఎలక్ట్రీషియన్‌ను సంప్రదించాలి. ఇక అతను దీనిని మీ ఇంట్లో ఇన్స్టాల్ చేస్తారు. దీంతో అనవసర విద్యుత్ చాలా ఈజీగా వృథాను నివారించవచ్చు. ఇక అనవసరంగా విద్యుత్తును ఉపయోగించకుండా ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలను నిరోధిస్తుందో కూడా కంపెనీ పేర్కొంది.


ఈ ఉత్పత్తి ఎంత వారంటీ ఇంకా ఎంత విద్యుత్ ఆదా అవుతుంది అనే దాని గురించి అధికారిక సమాచారం అనేది అందుబాటులో లేదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం కంపెనీ క్లెయిమ్ చేసిన సమాచారం మాత్రమే.ఇక MD Proelectra కంపెనీ ప్రకారం, మీరు ఈ సేవర్‌ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా ఎంతో నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకంటే మీ నెలవారీ కరెంటు బిల్లు 800 నుండి 1000 రూపాయలు ఉంటే ఈ పేవర్ సేవర్ ని మీ ఇంట్లో ఇన్ స్టాల్ చేసిన తర్వాత 400 నుంచి 500 రూపాయలకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎలా పని చేస్తుంది? ఇంట్లోని రిఫ్రిజిరేటర్లు అలాగే ఫ్యాన్‌లతో సహా ఇతర ఎలక్ట్రికల్ పరికరాలపై వృధా అవుతున్న అనవసరమైన విద్యుత్‌ను ఈ పరికరం ఎలా నియంత్రిస్తుందనే దాని గురించి సమాచారం ఇవ్వలేదు.ఈ ఎలక్ట్రిక్ పవర్ సేవర్‌ను ఫిక్స్ చేయడానికి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆమోదం తీసుకోవాలో ఏమో కూడా సమాచారం లేదు. కానీ ఇ-కామర్స్‌లో మాత్రం ఇప్పుడు చాలా మంది ఈ పవర్ సేవర్‌ని కొనుగోలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: