

అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వ ఉద్యోగం పదవీ విరమణ వయసు మళ్లీ మూడు సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక జీవో ని నవంబర్ 15న శనివారం రోజున ప్రభుత్వం జారీ చేసిందని ఒక ఫేక్ జీవో లెటర్ ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. దీనిపై స్పందించిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి అధికారులు ఈ ఫేక్ జీవో పైన గుంటూరు రేంజ్ డీజీపీ అధికారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ కేసు పైన విచారణ చేపట్టాలని ఎస్పీని డిఐజీ కి ఆదేశించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి
అయితే ఎట్టకేలకు మాత్రం అధికారులు ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వడంతో ఎలాంటి ఉద్యోగులకు వయసు పెంచలేదని విషయంపై అధికారులు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో అధికారంలో ఉన్న పార్టీని.. కావాలని ఇలాంటి ఫేక్ వార్తలు సృష్టిస్తోంది ప్రతిపక్ష పార్టీలు అంటూ ఫైర్ అవుతున్నారు. అలాగే గడిచిన కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగాల సంఘానికి అధ్యక్షుడు అయిన సూర్యనారాయణ కొంతమంది నాయకులతో కలిసి గవర్నర్ హరిచంద్రను కలిసి ప్రభుత్వం పైన ఫిర్యాదు చేశారు. ఉద్యోగులకు రావలసిన పదివేల కోట్ల బకాయిలు ఇప్పించేలా జోక్యం చేసుకోవాలంటే కోరారు.