
సాధారణంగా బావిలో ఉన్న నీటిని పైనకి తీసుకురావాలి అంటే దానికోసం స్పెషల్ గా ఒక బోర్ మోటార్ తీసుకువచ్చి ఇక కరెంట్ సప్లై చేసినప్పుడు మాత్రమే ఇక నీటిని పైనకు తీసుకువచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇక బావిలోకి దిగి నీటిని మోయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం బావిలో ఉన్న నీటిని బయటకు తీసుకువచ్చేందుకు వినూత్నమైన ఆలోచన చేశాడు. పెద్దగా కష్టపడకుండానే కరెంట్ లేకుండానే ఇక ఎంతో ఈజీగా నీటిని తోడుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో తెగచక్కర్లు కొడుతుంది.
ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక బాలుడు ఒక పొడవాటి కర్ర, టైరు, చిన్న వాటర్ పైపుతో ఒక ప్రత్యేకమైన పరికరాన్ని తయారు చేశాడు అని చెప్పాలి. ఇక దాని సహాయంతో కరెంటు అక్కర్లేకుండానే ఒక నీటి గుంట నుంచి నీటిని తోడేస్తూ ఉన్నాడు. తద్వారా ఇక తమ దగ్గర ఉన్న చిన్న వాటర్ ట్యాంకుల్లో నింపేసుకుంటున్నాడు అని చెప్పాలి. కర్రకు ఒకవైపున బరువును మరోవైపున టైరును బిగించాడు. ఇక ఆ టైరుకే నీళ్ల పైపును కూడా తొలగించాడు. దాని ద్వారానే నీటిని పైకి తీసుకురావడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అతని ఐడియాకు అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు..