దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తాజాగా తీసుకొచ్చిన రిక్రూట్మెంట్ రూల్స్ లో కొన్ని వివక్ష పూరితంగా మార్పులు చేశారు అంటూ మహిళా కమిషన్ ఎస్బిఐ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె దెబ్బకు భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకుకు పెద్ద షాక్ తగిలింది అని చెప్పవచ్చు.. ఇకపోతే మహిళా కమిషన్ ఎస్బిఐ పై ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణం ఏమిటంటే తాజాగా వదిలిన రిక్రూట్మెంట్ విభాగంలో మూడు నెలలు నిండిన గర్భిణీ స్త్రీలను రిక్రూట్మెంట్ నుంచి తొలగించడం తో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇకపోతే ఢిల్లీ మహిళా కమిషన్ ఎస్బిఐ నోటీసు జారీ చేయగా.. ఈమెకు మద్దతుగా నిలుస్తూ ఎస్బిఐ బ్యాంకు ఇలాంటి కొత్త చట్టాలను తీసుకురావడం వివక్షత చట్ట విరుద్ధమంటూ డి సి డబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ తెలిపారు. ఇక దీంతో ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గర్భిణీ స్త్రీల అభ్యర్థుల, నియామక నిబంధనలను పూర్తిగా మార్చివేసింది. ఇక నిబంధనల మేరకు కొత్త రిక్రూట్ మెంట్ విభాగంలో మహిళలు ఎవరైనా సరే గర్భం దాల్చినప్పుడు మూడు లేదా ఎక్కువ నెలల గర్భవతి గా ఉన్నట్లయితే వారు కూడా అర్హులుగా పరిగణించనున్నారు.. గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత నాలుగు నెలల లోపు తిరిగి జాబ్ లో జాయిన్ కావచ్చు అని స్పష్టం చేసింది..

ఇక తాజాగా విడుదలైన కొత్త రిక్రూట్మెంట్లో ఎస్బిఐ తన కొత్త మెడికల్ ఫిట్నెస్ మార్గదర్శకాల లో కూడా నిబంధనలను మార్చడం జరిగింది. అదేమిటంటే మూడు నెలల కంటే తక్కువ గర్భవతి అయిన స్త్రీలు ఫిట్ గా పరిగణిస్తామని పేర్కొనడం గమనార్హం.. ఇకపోతే డిసెంబర్ 31 2021 వ తేదీన జారీ చేసిన ఈ ఫిట్నెస్ ప్రమాణాల ప్రకారం గర్భం మూడు నెలలు దాటితే ఆ  మహిళా అభ్యర్థి తాత్కాలికంగా ఇప్పుడు ఈ రూల్స్ ను మార్చినట్లు సమాచారం. ఒకవేళ మహిళా అభ్యర్థి మూడు నెలల కంటే ఎక్కువ సమయం జన్మించిన తరువాత నాలుగు నెలల్లో ఉద్యోగంలో చేరడానికి అనుమతించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: