భార్యా, భర్తల మధ్య అన్యొన్యత, ఆప్యాయత, ఉంటేనే ఆ బంధం ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది.లేకుంటే చిన్న చిన్న వాటికి కూడా తెగ ఫీల్ అవుతూ చికాకులు పడతారు.ఇకపోతే ఆ బంధం కాస్త విడాకులు కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.తాజాగా వెలుగు చూసిన ఘటన వింటే ముచ్చటగా అనిపిస్తుంది.ఎండనకా,వాన అనక కష్ట పడి బిక్షాటన చేయగా వచ్చిన డబ్బులను భార్య కోసం ఖర్చు చేసాడు.భార్య బాధను చూసి చలించి పోయాడు.ఇప్పుడు అతను చేసిన పని సోషల్ మీడియాలో మారు మోగి పోతుంది..


వివరాల్లొకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని చింధ్వారా జిల్లా అమరవర గ్రామంలో నాలుగేళ్లపాటు భిక్షాటన చేసిన డబ్బుల్ని పొదుపు చేసి భార్యకు రూ 90,000 విలువైన మోపెడ్‌ను బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఎంచక్కా ఆ బండిమీద తిరుగు భిక్షాటన చేస్తున్నారు సంతోష్ సాహు అనే యాచకుడు అతని భార్య కలిసి..సంతోష్ సాహు అనే యాచకుడికి రెండు కాళ్లు పనిచేయవు. భార్య మున్నిసాహుతో కలిసి మూడు చక్రాల బండిమీద తిరుగుతు వీధుల వెంట తిరుగుతూ సంతోష్ సాహు యాచించే వాడు. అలా సంతోష్ సాహు ఆ మూడు చక్రాల  కూర్చుంటే భార్య మున్నిసాహు తోస్తుండేది. అలా ఇద్దరు కలిసి భిక్షాటన చేసేవారు.అలా మూడు గాన్ల సైకిల్ పై తోసుకుంటూ వచ్చిన సంపాదన తో పూట గడిచేది..అతని భార్య తరచూ అనారోగ్యం పాలవుతుండేది. ఇది చూసిన సంతోష్ మోపెడ్ కొనాలని నిర్ణయించుకున్నాడు. మున్ని సాహు ట్రైసైకిల్‌ను తోస్తుండగా గుళ్లు, మసీదులు, బస్టాండ్‌ల వద్ద రోజూ యాచక వృత్తితో జీవించేవాడు. అలా సాహు దంపతులు రోజుకు రూ 300 నుంచి రూ 400 వరకూ సంపాదించేవారు. మొత్తంమీద నాలుగేండ్లలో రూ 90,000 నగదు పోగేసిన సంతోష్ సాహు మోపెడ్‌ను కొనుగోలు చేయగా ఇప్పుడు ఆ దంపతులు మోపెడ్‌పై భిక్షాటన చేస్తున్నారు..భార్య కోసం అతను చేసిన దానికి అందరు అభినందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: