మా అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్రమానికి హాజ‌రైన తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మోహ‌న్‌బాబు కుటుంబాన్ని ఆకాశానికెత్తేశారు. ప్ర‌భుత్వం పూర్తి మ‌ద్ద‌తిస్తుంద‌ని తెలియ‌జెప్ప‌డంతోపాటు ఒక‌ర‌కంగా ప‌రిశ్ర‌మ‌ను భుజానికెత్తుకునేలా త‌ల‌సాని మాట‌లున్నాయి. సినిమావాళ్లే ఏ ప్ర‌భుత్వం మారితే ఆ ప్ర‌భుత్వం వారికి మ‌ద్ద‌తు తెలియ‌జేస్తార‌ని అంటుంటారు. ఇప్పుడు దీనికి విరుద్ధంగా ప్ర‌భుత్వం కూడా పార్టీ మార్చింది. త‌ల‌సాని మాట‌ల‌ను బ‌ట్టి అక్క‌డి ప్ర‌భుత్వం కూడా యూట‌ర్న్ తీసుకున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. విష్ణు ప్యానెల్‌కు మద్ద‌తివ్వ‌డ‌మే కాకుండా మోహ‌న్‌బాబును ఆకాశానికెత్తేశారు. తెలంగాణ రాష్ట్రంలో సినిమా షూటింగ్‌ల‌కు ఎన్నో అనువైన ప్ర‌దేశాలున్నాయ‌ని, వాటిని ఉప‌యోగించుకోవాల‌ని మంత్రి కోరారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ప్రాధాన్య‌మిచ్చే మోహ‌న్‌బాబు త‌న త‌న‌యుడు విష్ణుకు కూడా క్ర‌మ‌శిక్ష‌న నేర్పార‌ని, అందుకే ఆయ‌న ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించార‌ని, ఇది చాలా పెద్ద సంస్థ అని, సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌క‌న్నా మిన్న‌గా జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించినందుకు ప్ర‌తి ఒక్క‌రికీ ఆయ‌న అభినంద‌న‌లు తెలియ‌జేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

maa