నందమూరి బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే బాలయ్య కు సంభందించిన పోస్టర్లు విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలయ్య గెటప్ చూసి అభిమానులు అవాక్కయ్యారు. అంతే కాకుండా సినిమాలో బాలయ్య గెటప్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పలు అప్డేట్ లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా సినిమా నుండి  దీపావళి కానుకగా టైటిల్ ప్రోమోను విడుదల చేసింది. అయితే ఈ పాట మొత్తాన్ని తాజాగా విడుదల చేసింది. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ పాట లిరిక్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో జగపతి బాబు ...శ్రీకాంత్ మరియు పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. మిరియాల సత్యనారాయణ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: