ఏపీ సమగ్రాభివృద్ధి రద్దు బిల్లు మండలిలో ప్రవేశ పెట్టారు ఏపీ ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. ఈ బిల్లు ఉద్దేశాలను ఆయన శాసన సభలో సభ్యులకు వివరించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చట్టం తీసుకొచ్చాం అని ఆయన స్పష్టం చేసారు. ఇక హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరగడం వల్ల విభజన సమస్య వచ్చింది అని ఆయన గుర్తించారు. దేవుడి దయ వల్ల తెలంగాణ ఎక్కడా వెనకపడలేదు అని అన్నారు  బుగ్గన .

అభివృద్ధి చెందనిది తెలంగాణ కాదు అని రాయలసీమ, ఉత్తరాంధ్ర అని స్పష్టం చేసారు. బీ హెచ్ ఈ ఎల్  వంటి కేంద్ర సంస్థలన్నీ హైదరాబాద్ లోనే స్థాపించారు అని ఇతర రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలు మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు అన్నారు. మరింతమంది తో చర్చలు జరిపి అందరికీ ఆమోదంగా ఉండేలా కొత్త బిల్లు తీసుకోస్తాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap