ఏపీఎస్‌ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా  అద్దె బస్సుల కోసం టెండర్లు పిలుస్తోంది. మొత్తం 659 అద్దె  బస్సులు ప్రవేశపెట్టేందుకు రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ టెండర్లు ఆహ్వానించింది.  9 ఏసీ స్లీపర్ బస్సులు , 47నాన్ ఏసీ స్లీపర్ ,  6ఇంద్ర ఏసీ , 46 సూపర్ లగ్జరీ బస్సుల కోసం టెండర్లు కోరుతోంది. అలాగే మరో   22 ఆల్ట్రా డీలక్స్, 70 ఎక్స్ ప్రెస్, 208 ఆల్ట్రా పల్లె వెలుగు, 203  పల్లె వెలుగు, 39 మెట్రో ఎక్స్ ప్రెస్ ,9 సిటీ ఆర్డినరీ బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు ఆహ్వానిస్తోంది.


జిల్లాల వారీగా పలు రకాల బస్సులు, సంఖ్య నిర్ణయించారు. ఆ మేరకు టెండర్లు ఆహ్వానించారు.  ఆసక్తి కల్గిన వారు ఎంఎస్‌టీసీ ఈ కామర్స్ పోర్టల్ లో రిజిష్టర్ చేసుకోవచ్చు. ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు బిడ్లు దాఖలు చేయవచ్చని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మరిన్ని వివరాల కోసం apsrtc.ap.gov.in వెబ్ సైట్‌ చూడొచ్చని అక్కడ పూర్తి వివరాలు పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: