
కవిత నుంచి కేసీఆర్ పతనం ప్రారంభంకాబోతుందని.. విజయశాంతి అన్నారు. బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు భరోసా కల్పించేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారన్న బీజేపీ నేతలు.. కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు,సీఎం మెప్పుపొందేందుకు యాత్రపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వచ్చాయని.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసును పక్కదారి పట్టించేందుకు బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకున్నారని వారు అంటున్నారు.