మనం వంట చేస్తుంటాం.. వంట చెయ్యడంలో ఎంత సీనియర్స్ అయినా అప్పుడప్పుడు గాయాలు అవుతూనే ఉంటాయి. చేతులు కాలుతూనే ఉంటాయి. ఆలా కాలిన గాయాలు ఊరికే ఉంటాయా? మాటకి బాధ పెట్టడానికి బొబ్బలు వస్తాయి. అవి వచ్చాక అయినా వూరికే ఉంటాయా అంటే? ఉండవు.. మంట పుట్టించి ఇంట్లో అమ్మను గుర్తు చేస్తుంది. ఆలా ఇబ్బంది పెట్టకుండా.. మాన్తా పుట్టకుండా బోబ్బా తగ్గిపోడానికి ఇక్కడ చిట్కాలు చదివి తెలుసుకోండి. 

 

బ్లాక్‌ టీ బ్యాగులను డీప్‌ ఫ్రిజ్‌లో కాసేపు పెట్టి ఆ తర్వాత ఆ బ్యాగులను కాలిన గాయాల మీద ఉంచితే బ్లాక్‌ టీలో ఉండే టానిక్‌ యాసిడ్‌ చర్మానికి సాంత్వన అందించి నొప్పీ, మంటను తగ్గించేస్తుంది. 

 

తేనెలో ఎన్ని మంచి గుణాలు ఉంటాయి అనేది అందరికి తెలిసిందే. అయితే ఈ తేనెలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉంటాయి కాబట్టి తేనెను రాత్రి పడుకునే ముందు కాలిన గాయం మీద రాయాలి. ఇలా చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఆ తేన కాపాడుతుంది. 

 

కాలినచోట పాలు రాస్తే త్వరగా గాయాలూ తగ్గుతాయి. అలానే బాగా మంటగా అనిపించినప్పుడు ఫ్రిజ్‌లో పెట్టిన పాలలో దూదిని ముంచి గాయాల మీద రాసిన వెంటనే మంట తగ్గుతుంది. 

 

పుదీనా ఆకులను మెత్తగా చేసి ఆ పుదీనా ఆకుల గుజ్జుని కాలిన చోట పూతలా రాస్తే మాన్తా త్వరగా తగ్గుతుంది. 

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని కాలిన గాయాల నుండి కాపాడుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: