ఏపీలో రోజు రోజుకు క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగి పోతున్నాయి. నిన్న ఒక్క రోజు కేవ‌లం ఒక్క క‌రోనా కేసు మాత్ర‌మే న‌మోదు కావ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకోగా సాయంత్రానికి మ‌ళ్లీ కొత్త కేసులు వ‌చ్చేశాయి. తాజాగా బుధ‌వారం అనంత‌పురం జిల్లాలో 7 కొత్త కేసులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ ఏడు కేసులతో మొత్తం జిల్లాలో 13 కేసులు న‌మోదు అయ్యాయి. ఈ విష‌యాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ గంధం చంద్రుడు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో క‌రోనా ప‌రిస్థితి కాస్త కంట్ర‌ల్లోనే ఉంద‌ని అనుకుంటోన్న టైంలో ఈ ఒక్క రోజే ఏకంగా ఏడు కేసులు న‌మోదు కావ‌డంతో జిల్లాలో తీవ్ర ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

 

తాజా కేసుల్లో మ‌క్కా నుంచి మ‌రో ఇద్ద‌రికి పాజిటివ్ న‌మోదు అయ్యింది. అలాగే క‌ళ్యాణ‌దుర్గం నుంచి ఢిల్లీ వెళ్లిన వ్య‌క్తికి సైతం క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదు అయ్యింది. ఇక ఇటీవ‌ల క‌రోనా పాజిటివ్‌తో మృతి చెందిన వ్య‌క్తికి వైద్యం చేసిన న‌లుగురు డాక్ట‌ర్ల‌కు క‌రోనా సోక‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. క‌రోనా రోగికి వైద్యం చేసిన న‌లుగురు డాక్ట‌ర్ల‌కే క‌రోనా రావ‌డంతో అస‌లు ఏం చేయాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇది ఇప్పుడు ఏపీలోనే పెద్ద సంచ‌ల‌నంగా మారింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: