భార‌త్‌పై పాకిస్తాన్ చేస్తున్న మ‌రో కుట్ర బ‌ట్ట‌బ‌య‌లైంది. గ‌ల్ఫ‌దేశాల్లో భార‌త్‌పై ద్వేషం పెంచ‌డానికి పాక్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు బెడిసికొట్టాయి. భార‌త్‌పై త‌ప్పుడు వార్త‌ల‌ను వ్యాప్తి చేయ‌డానికి పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంట‌ర్ స‌ర్వీసెస్ ఇంటెలిజెన్స్‌(ఐఎస్ఐ) ఉప‌యోగించిన న‌కిలీ ఖాతాను ట్విట్ట‌ర్ తొల‌గించింది. సౌదీ అరేబియా యువ‌రాణి పేరిట న‌కిలీ ఖాతాను క్రియేట్ చేసిన పాక్ ఐఎస్ఐకి ట్విట్ట‌ర్ గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఆ యువ‌రాణిపేరిట క్రియేట్ ఖాతాను పాక్ నుంచి న‌డిపిస్తూ భార‌త్‌పై దుష్ర్ప‌చారానికి పాల్ప‌డుతున్న‌ట్లు తేల‌డంతో ట్విట్ట‌ర్ వెంట‌నే స్పందించి స‌స్పెండ్ చేసింది.  సోషల్ మీడియాలో న‌కిలీ ఖాతాలను ఉపయోగించడం ద్వారా గల్ఫ్ దేశాల్లో భారత్, ప్రధాని నరేంద్ర మోడీపై ఐఎస్ఐ ద్వేషం పెంచుతోందని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి. గ‌త మంగళవారం, బుధ‌వారం ట్రెండింగ్‌లో ఉన్న #ShameOnModi,  #ChaosInIndia అనే రెండు హ్యాష్‌ట్యాగ్‌ల వెనుక ఐఎస్ఐ ఉందని భారత భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి.

 

అంతేగాకుండా.. ఒమ‌న్ యువ‌రాణి పేరిట కూడా న‌కిలీ ఖాతాను క్రియేట్ చేసిన పాకిస్తాన్ మంగళవారం భారత వ్యతిరేక విషయాలను ట్వీట్ చేసింది. తాజాగా.. ట్విట్ట‌ర్ తొల‌గించిన ఖాతా నుంచే అనేక పాత భారత వ్యతిరేక ట్వీట్ల‌ను గుర్తించారు. ఈ ఖాతాను  రెండు పాకిస్తాన్ ఏజెన్సీలు - ఐఎస్ఐ, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పిఆర్)  నిర్వహిస్తున్నట్లు సూచించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి.. భార‌త్‌లో క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌ధాని మోడీ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను గ‌ల్ఫ‌దేశాలు ప్ర‌శంసిస్తున్నాయి. కానీ.. త‌ప్పుడు ఖాతాల ద్వారా.. గ‌ల్ఫ్ యువ‌రాణుల పేరిట త‌ప్పుడు వార్తాల‌ను వ్యాప్తి చేసేందుకు పాక్ కుట్ర‌లు చేసింది. అంతేగాకుండా.. భారతదేశంలో ముస్లింలు సురక్షితంగా లేరని సోషల్ మీడియా వేదికలపై ప్రచారం చేయడం వెనుక ఐఎస్ఐ ఉందని భార‌త్ భ‌ద్ర‌తా సంస్థ‌ల అధికారులు ఆరోపించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: