ఈ మద్య తెలుగు తెరపై ఎంతో మంది యంగ్ హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  తమిళ, మళియాళ, కన్నడ బ్యూటీలు వరుస విజయాలు సాధిస్తూ మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు.ఈ నేపథ్యంలో `రన్ రాజా రన్`, `టచ్ చేసి చూడు`, `ఒక్క క్షణం` వంటి పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది కుర్ర హీరోయిన్ సీరత్ కపూర్.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రజలపై ఎంతో ప్రభావం చూపించిందని.. మనిషి చూసి మనిషి భయపడే పరిస్థితి నెలకొందని అన్నారు.  లాక్‌డౌన్ తర్వాత సినిమాల చిత్రీకరణలో, పాటల చిత్రీకరణలో పలు మార్పులు చేర్పులు జరుగుతాయన్న అనుమానాలు వస్తున్నాయని చెబుతుంది ఈ చిన్నది. 

 

బహుషా.. హగ్గింగ్.. లిప్ లాక్ సీన్లు  తెరకెక్కించడం తగ్గుతుందేమో. గ్రూప్ డ్యాన్సర్లతో పాటలను చిత్రీకరించడం కష్టమవుతుంది. శానిటైజర్లు వాడడం, తరచుగా డ్యాన్స్ గ్రూప్స్‌ను మార్చడం, షవర్లను ఏర్పాటు చేయడం, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వంటి చర్యలు చేపడుతూ గ్రూప్ సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉంటుంది. అంతే కాదు చీటికి మాటికి విదేశాల్లో షూటింగ్స్ కూడా ఉండవని అనుకుంటున్నా అని ఈ హాట్ బ్యూటీ నిజాలు చెప్పకనే చెబుతుంది.  మొత్తానికి కరోనా శుభ్రత విషయంలోనూ, బయటి తిండి విషయంలోనూ బోలెడన్ని గుణపాఠాలు నేర్పింద ని సీరత్ అభిప్రాయపడింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: