క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి విధించిన‌ లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లోనే చిక్కుకుపోయిన‌ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు 65 రోజుల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టారు. విమానాలు ర‌ద్దు కావ‌డంతో రోడ్డుమార్గంలో ఆయ‌న బ‌య‌లుదేరారు. మార్చి 22న హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు...లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో అక్కడే ఉండిపోయారు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో చంద్రబాబు ఏపీకి తిరిగి వచ్చారు. ఈరోజు నుంచి విమానాలు నడపాలని కేంద్రం నిర్ణయించింది.

 

దీంతో విశాఖపట్నం వెళ్లేందుకు డీజీపీని చంద్రబాబు అనుమతి కోరిన విష‌యం తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం సూచన మేరకు  ఈరోజు విమానాలను నిలిపివేసి, రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి తాడేపల్లి‌లో తన నివాసానికి చంద్రబాబు బయలుదేరారు. అయితే.. స‌రిహ‌ద్దు గరికపాడు చెక్‌‌పోస్ట్ వద్ద చంద్రబాబు కాన్వాయ్ వాహనాల వరకు అనుమతించిన పోలీసులు...అదనంగా ఉన్న కార్లను ఆపి తనిఖీలు నిర్వహించడం గ‌మ‌నార్హం.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: