టీడీపీ సీనియర్ నేత జేసి ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ యువనేత, జేసి దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి స్పందించారు. చిన్నాన్న అరెస్ట్ అన్యాయమన్నారు. విచారణ ఎదుర్కొనేందుకు తాను పోలీసుల ఎదుట హాజర సిద్ధంగాయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించినా సరే ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అని నిలదీశారు. 

 

విచారణకు హాజరవుతానని పోలీసులకు పలుసార్లు చెప్పినా సరే అవసరం లేదని చెప్పి ఇప్పుడు ఏ విధంగా అదుపులోకి తీసుకుంటారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు సూత్రధారులను వదిలివేసి బాధితుడైన తన చిన్నాన్నను అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: