బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని కన్సార్షియంల నుంచి అధిక మొత్తంలో రుణాలు తీసుకుని రూ.754కోట్లు మోసం చేశారన్న ఆరోపణతో ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన బీఎస్పీ ఎమ్మెల్యే వినయ్‌ శంకర్‌ తివారీపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన భార్య రిటా, గంగోత్రి ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ డైరెక్టర్‌ అజిత్‌ పాండేలపై సీబీఐ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.లఖ్‌నవూలోని 'గంగోత్రి ఎంటర్‌ప్రైజెస్‌', నొయిడాలోని మరో కంపెనీ 'రాయల్‌ ఎంపైర్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌'లతో పాటు తివారీ, పాండే ఇళ్లలో సోమవారం సీబీఐ సోదాలు నిర్వహించింది.


అధికారుల వివరాల ప్రకారం.. రోడ్లు, వంతెనలు నిర్మించే గంగోత్రి ఎంటర్‌ప్రైజెస్‌.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని కన్సార్షియంల నుంచి రుణ సదుపాయాలను ఉపయోగించుకుంది. 'ట్రస్ట్‌, రిటెన్షన్‌ అకౌంట్‌' ద్వారా ఈ కంపెనీ లావాదేవీలు నిర్వహించాల్సి ఉండగా.. సంస్థ ఆ విధంగా చేయడంలేదన్న ఆరోపణలున్నాయి. అనంతరం సంస్థ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు ఏర్పడినట్లు ఆరోపణలు వచ్చాయని సీబీఐ అధికార ప్రతినిధి ఆర్కే గైర్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: