కరోనా వ్యాక్సిన్​ తొలిదశ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా సాధారణ ఆరోగ్య సేవల్లో అంతరాయాలు లేకుండా కరోనా టీకా పంపిణీకి సమన్వయం, పర్యవేక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా వైరస్ టీకాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే వదంతులకు అడ్డుకట్ట వేసేందుకు సోషల్​ మీడియాపైనా దృష్టిసారించాలని కేంద్రప్రభుత్వం సూచనలు చేసింది.


కరోనా వ్యాక్సిన్​ పంపిణీలో తొలుత ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మరో ఏడాదిలోగా దశల వారీగా అందరికీ టీకా అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచిస్తూ తాజాగా లేఖ రాశారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: