అమెరికా, చైనా తమ మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాల తెగదెంపులపై చర్చిడం సాధ్యం కాదని చైనాకు చెందిన ఓ అధికారి అన్నారు. ఇది వాస్తవికమైనది కాదని, దీనితో ఇరు దేశాలకు లేదా ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.సీపీసీ కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్​ హన్​ వెన్​జియూ.. చైనా, అమెరికా సంబంధాలపై మాట్లాడారు.


ఆయా దేశాల ఆర్థిక నిర్మాణాన్ని సంతృప్తిపరచటంపై రెండు దేశాల సంబంధాలు ఆధారపడి ఉంటాయన్నారు.అయితే, రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్... ప్రధానంగా చైనాతో సంబంధాల తెంచుకోవటంపై దృష్టి సారించారు. తయారీ రంగంలోనూ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: