ప్రధాని మోడీ   సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులు అర్పించారు. గుజరాత్‌ లోని కేవాడియాలో... ఐక్యతా విగ్రహం వద్ద   నివాళి అర్పించగా... ఢిల్లీలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోం శాఖా మంత్రి  అమిత్‌ షా నివాళి అర్పించారు. ఇక కేవాదియాలో ప్రధాని వచ్చిన నేపధ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేసారు.

బీహార్ సిఎం నితీష్ కుమార్ కూడా నివాళి అర్పించారు. ఇక ప్రధాని మాట్లాడుతూ... పటేల్ చేసిన కృషిని, భారతదేశ ఏకీకరణలో ఆయన ఎలా ప్రధాన పాత్ర పోషించారో వివరిస్తూ, ఉగ్రవాదం తీవ్రమైన సమస్యగా మారిన నేటి ప్రపంచంలో ఐక్యత సందేశం మరింత ముఖ్యమని పిఎం మోడీ అన్నారు. సర్దార్ పటేల్ మార్గదర్శకత్వంలో దేశ ప్రగతి కోసం భారత్ తన ప్రతిజ్ఞను ఈ రోజు మరోసారి పునరావృతం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: