దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈనేపథ్యంలో అన్ని బస్ సర్వీసులు, ప్రజారవాణా బంద్ అయ్యింది. కాగా అంతకు ముందు వరకు బస్సుల్లో తిరుగుతూ లాక్డౌన్ పెట్టే చివరి వరకూ బస్పాస్లను రెన్యువల్ చేయించుకున్న వారూ ఉన్నారు. అయితే అలా చేయించుకుని తర్వాత లాక్డౌన్ వల్ల ఇంటి నుంచి బయటకు రాలేక చాలా మంది గృహ నిర్భందం అయ్యారు. కాగా ఆ పాస్లు వృథా అవుతాయేమోనని పలువురిలో రేకెత్తుతున్న ప్రశ్నలకు తెలంగాణ రవాణాశాఖ జవాబిచ్చింది. బస్పాస్ వినియోగదారులూ ఆందోళన అవరసరం లేదంటూ ఓ శుభవార్త చెప్పింది.

లాక్డౌన్కు ముందు పాస్లను రెన్యువ‌ల్ చేసుకుని ఉప‌యోగించుకోలేని వారికి నష్టపోయిన రోజుల కోసం కొత్త బస్‌పాస్‌ను ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇది ఆర్టీసీలోని అన్ని సర్వీసుల బస్‌పాస్ వినియోగ‌దారుల‌కు వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. లాక్‌డౌన్‌కు ముందు రెన్యువ‌ల్ చేసుకున్న టికెట్‌ను, ఐడీకార్డును సమీపంలోని ఆర్టీసీ కౌంటర్‌లో ఇవ్వాలని.. దానికి వారు కొత్త పాస్లు ఇస్తార‌ని పేర్కొనింది. ఈపాస్లు వ‌చ్చేనెల 30 వరకు వినియోగించుకోవచ్చ‌ని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: