దుబ్బాక దెబ్బ నుంచి కేటీఆర్ ఇంకా కోలుకోలేదని బిజెపి సీనియర్ నేత లక్ష్మణ్ ఎద్దేవా చేసారు. గ్రేటర్ లో బీసీలకు అధిక ప్రాధాన్యం‌ ఇచ్చాం  అని ఆయన పేర్కొన్నారు. బీసీలకు కేసీఆర్ దేవుడు కాదు.. దెయ్యం అన్నారు. గ్రేటర్ లో బీసీలకు 86 స్థానాలు బీజేపీ కేటాయించాం అని చెప్పారు. నాలుగు జనరల్ స్థానాల్లో ఎస్సీలకు అవకాశమిచ్చాం అన్నారు. డిసెంబరు 4న అసలైన ప్రగతి నివేదికను టీఆర్ఎస్ కు ప్రజలు ఇవ్వబోతున్నారు అని ఆయన పేర్కొన్నారు.

హైద్రాబాద్ అభివృద్ధి గ్రాఫిక్స్ కు మాత్రమే పరిమితమైంది అని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రగతి నివేదికలో పచ్చి అబద్ధాలున్నాయి అన్నారు. పన్నుల రూపంలో నగర ప్రజలు 70వేల కోట్లు ప్రభుత్వానికి కడ్తున్నారు అని పేర్కొన్నారు. ఆరున్నరేళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ళు 450మాత్రమే అని ఆయన విమర్శించారు. ఎన్నికల కోసమే ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది అన్నారు. మెట్రో రైల్  ప్రారంభానికి ప్రథమ పౌరుడికి ఆహ్వానం లేకపోవడం అవమానించటమే అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: