బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పూనుకుంటోంది అని ఆయన విమర్శించారు. వార్డు వాలంటీర్ ఆధ్వర్యంలో జరుగుతున్న కుటుంబ సర్వే లో లేని మతాలను ఎందుకు పొందుపరిచారు అని ఆయన నిలదీశారు. ఆదివాసీ ప్రాంతాల్లో జరిపే సర్వేలో మతం అనే చోట ఆదివాసీమతం అనే కొత్త మతం ఎందుకు చేర్చారు అని ఆయన నిలదీశారు.

రాజ్యాంగానికి విరుద్దంగా ప్రభుత్వం ఎలా మతం కోలమ్ ను పొందుపరుస్తుంది నిలదీశారు. ఆదివాసీ మతం అనే ఎంపికను ఎందుకు పొందురిచారు అని నిలదీశారు. మతాన్ని ఎంచుకోండి అనే కోలమ్ పొందుపరచడంలో ఉద్దేశమేంటి అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ లను వేరొక మతంగా చూపించే ప్రయత్నం జరుగుతోందనారు. హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది అని విమర్శించారు. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపి ప్రభుత్వం విభేధాలకు తావిచ్చేలా చేస్తోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: