తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేశారు. రేప‌టినుంచి జ‌న‌జీవ‌నం సాధార‌ణంగానే ఉండ‌నుంది. దేశంలోను, ఇత‌ర రాష్ట్రాల్లోను కొవిడ్ పూర్తిగా అదుపులోకి వ‌స్తుండ‌టంతో రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. అలాగే జులై ఒక‌టో తేదీ నుంచి అన్ని విద్యాసంస్థ‌ల‌ను పునఃప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. లాక్‌డౌన్ ఎత్తేసినంత‌మాత్రాన ప్ర‌జ‌లెవ‌రూ నిర్ల‌క్ష్యంగా ఉండొద్ద‌ని, మాస్క్ ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం, చేతులు త‌రుచుగా శానిటైజ్ చేసుకోవ‌డంలాంటి స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని స్ప‌ష్టం చేసింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని మంత్రివ‌ర్గం కోరింది. ఇత‌ర రాష్ట్రాల‌క‌న్నా తెలంగాణ‌లోనే క‌రోనా పూర్తిగా అదుపులోకి వ‌చ్చింద‌ని కేబినెట్ అభిప్రాయ‌ప‌డింది. సామాన్యుల బ‌తుకుతెరువు దెబ్బ‌తిన‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే ఈ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని తెలిపింది. మ‌రోవైపు తెలంగాణ వ్యాప్తంగా టీకా ప్ర‌క్రియ స‌జావుగా సాగుతోంది. మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్‌లోని టీకా త‌యారీ కంపెనీల‌తో మాట్లాడి అవ‌స‌ర‌మైన్ని టీకాల స‌ర‌ఫ‌రాకు స‌హ‌క‌రించాల‌ని కోరారు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించి ప్ర‌జ‌లంద‌రికీ టీకా అందిస్తుండ‌టంతో చాలావ‌ర‌కు కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag