తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని అప్పుడే తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి దేశం మొత్తం జరుగుతుందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ మొక్క‌లు కనిపించలేదని... అందుకే అక్కడ కరువుకాటకాలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించాడు. తెలంగాణలో సీఎం కేసీఆర్ భవిష్యత్తును దృష్టితో ఉంచుకుని హరితహారం లాంటి కార్యక్రమాలను చేపట్టార‌ని అన్నారు. కెసిఆర్ ప్రధాన మంత్రి అయితే దేశం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అంతేకాకుండా ఏదో విమర్శల కోసమే కేసీఆర్ ను అంటున్నారని అంతే తప్ప ఆయన చేసిన కార్యక్రమాలు అందరికీ ఇష్టమే అని వ్యాఖ్యానించారు. దేశం మొత్తం తెలంగాణలా అభివృద్ధి జరగాలంటే ఆయనే ప్రధానమంత్రి కావాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు కేసీఆర్ ఇన్నాళ్లు థర్డ్ ఫ్రంట్ అంటూ మాట‌లు చెప్పారు. కానీ మళ్లీ వెళ్లి మోడీకి దండాలు పెట్టారు. దాంతో ఎమ్మెల్యే కోరిక నెర‌వేరేనానా అన్న ప్ర‌శ్న మోద‌లైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: