ఈ దేశం గుర్తుంచుకోద‌గ్గ విజ‌యం.. ఈ దేశం గ‌ర్వించ‌ద‌గ్గ విజ‌యం అందించిన ఆ బుజ్జాయి ఈ నేల‌పై అడుగిడిన త‌రుణం.. మీరా చానూ వెల్కం.. ఈ దేశం నుంచి మీరు కోరుకుంటున్న మ‌ద్ద‌తూ.. భ‌రోసా అన్నీ అన్నీ మీకు అందుతూనే ఉంటాయి..మీరు మాలో స్ఫూర్తినింపండి చాలు..మీరు మ‌రిన్ని విజ‌యాల‌కు కార‌ణం అవ్వండి చాలు. మీలానే ఈ నేల ఇక్క‌డి మ‌ట్టి ఆనందిస్తాయి.. టోక్యో ఒలంపిక్స్ త‌రువాత స్వ‌దేశంలో అడుగిడిన ఆ తార‌కు అనూహ్య స్వాగ‌తం ద‌క్కింది. దేశ రాజ‌ధానికి ఆమె చేరుకున్నాక ఈ ప‌త‌కం కోసం నేను త్యాగాలు చేశాను.. ఎన్నో అవ‌రోధాలు దాటాను. 2016 నుంచి చేస్తున్న సాధన కార‌ణంగానే ఈ విజ‌యం.. అంటూ మీ రాచాను త‌న గ‌తంలోకి వెళ్లారు.. ఈ దేశం అందించిన స‌హ‌కారానికి ఈ దేశ పెద్ద మోడీకి కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ పొంగిపోయారు. గు ర్తుంచుకోండి...మన ఈశాన్య నేల‌లు ఇలాంటి విజేత‌ల‌ను ఇచ్చాయి..వీరి రుణం మ‌రో విజేతను అందించ‌డంతోనే తీర్చుకోగ‌లం..మీరూ విజేత‌లు కావొచ్చు...మీరా చానూ మాదిరిగా త్యాగాల‌కూ అవ‌మానాలకూ సిద్ధం అయితే.,. ఆ రోజును ఎన్న‌టికీ మ‌రువ‌క  సాధ‌న చేస్తే.. విజేతా నీకు స్వాగ‌తం. ఈ దేశం నీకు వంద‌నాలు చెల్లిస్తుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: