ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా సోకిన విషయం తెలిసిందే. గత రెండు రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేశారు. అందులో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నారాయణ స్వామి అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చినట్టు సమాచారం. 


ఈరోజు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు నెగిటివ్ గా నిర్ధారణ అయ్యిందని తెలుస్తోంది. అయినప్పటికీ నారాయణ స్వామి పూర్తిగా కోలుకోక పోవడంతో వైద్యులు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎంను ఐసోలేషన్ లో ఉండాలని చెప్పారు. డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు. కరోనా తగ్గే వరకూ నారాయణ స్వామి ఎవరినీ కలవరు. మరోవైపు దేశంలో కరోనా నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. కొన్నాళ్ల క్రితం కంటే కూడా ఇప్పుడు కేసులు బాగా తగ్గాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: