దూకుడుగా ఆడటం వలనే ఒలంపిక్స్ లో భారత హాకీ జట్లు విజయాలు సాధిస్తున్నాయని భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ముఖేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఒలంపిక్స్ లో భారత హాకీ జట్లు ప్రదర్శన అధ్బుతమని కితాబు ఇచ్చారు ఆయన. మళ్ళీ హాకీకి మంచి రోజులు వస్తున్నాయి అని అన్నారు. హాకీ స్టిక్ పట్టుకుని చిన్నారులు మళ్ళీ మైదానం వైపు కదిలేలా.. హాకీ జట్లు స్పూర్తిని నింపాయి అని కొనియాడారు.

సెమీలో ఓటమిని పట్టించుకోకుండా మూడో స్థానం‌పై  టీం ఇండియా దృష్టి పెట్టాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. ఒలంపిక్స్ లాంటి పెద్ద టోర్నమెంట్స్ లో తప్పులు చేయకుంటేనే మ్యాచ్ గెలుస్తాం అని అన్నారు. మొదటి రెండు క్వాటర్స్ లో బాగా అడినా.. తర్వాత టీం ఇండియా ఒత్తిడిలోకి వెళ్ళిందన్న ఆయన మహిళల హాకీ జట్టు ప్రదర్శన అద్భుతమైనది అని కొనియాడారు. అస్ట్రేలియాపై మహిళల జట్టు గెలవటం సామాన్యమైన విషయం కాదన్నారు.

సెమీస్ లో అర్జెంటీనాతో మ్యాచ్ లో మహిళల జట్టు దూకుడుగా ఆడాలని హాకీ క్రీడకు జీవం పోసిన ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు ధన్యవాదాలు చెప్పారు. ఒడిషా సీఎం స్వయంగా హకీ క్రీడాకారుడు కావటంతో భారత్ లో హకీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు అని ఆయన అభినందించారు. క్రికెట్ మాదిరి ఒక రంజీ మ్యాచ్ ఆడితే లక్షన్నర మ్యాచ్ ఫీజు  అవసరం లేదు అని దేశానికి ప్రాతినిధ్యం వహించిన హకీ ప్లేయర్ కు ఉద్యోగం చాలు అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: