ఆదివారం జరిగే శోభ యాత్ర కు భారీగా ఏర్పాట్లు చేశాం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అన్ని విభాగాల సమన్వయం కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం అని పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనం చాలా పెద్ద కార్యక్రమం..దీన్ని విజయవంతం గా నిర్వహించాలి అని ఆయన వివరించారు. నగర ఉత్సవాలను దేశం మొత్తం చూస్తుంది అని ఆయన తెలిపారు.

అన్ని శాఖల సమన్వయం లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రెండు రోజుల్లో అన్ని పనులు కంప్లీట్ చెయ్యాలి అని ఆయన తెలిపారు. హుస్సేన్ సాగర్ పై  అంబులెన్స్ అందుబాటు లో ఉంచుతాం అని ఆయన తెలిపారు. పూజ సామగ్రి తొలిగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసామని ఆయన వివరించారు. ట్యాంక్ బండ్ పై 1,25,000 మాస్కులు పంపిణీ కోసం ఏర్పాటు చేసాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: