బాబోయ్‌.. నాకొద్దు ఆ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అంటున్నారు సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌లు. పంజాబ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న కెప్టెన్ అమ‌రింద‌ర్‌సింగ్ పార్టీలోని అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌కు విసిగిపోయి త‌న ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించిన సంగ‌తి తెలిసిందే. త‌న స‌న్నిహితుల‌తో క‌లిసి భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌న్నారు. సిద్ధూకు ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ఉండ‌టంతో ఎన్నిసార్లు అత‌ను ఇబ్బంది పెట్టిన‌ప్ప‌టికీ అధిష్టానం చూసీచూడ‌న‌ట్లుగా వ‌దిలేయ‌డం కూడా కెప్టెన్ మ‌న‌సును నొప్పించింది. పార్టీ సీనియ‌ర్ నేత అంబికాసోనీని ముఖ్య‌మంత్రిగా చేయాల‌ని అధిష్టానం భావించ‌గా ఆమె తిర‌స్క‌రించిన‌ట్లు తెలుస్తోంది. పంజాబ్ కాంగ్రెస్‌లో సిద్ధూ ఆధిప‌త్యం పెరిగిపోవ‌డం.. మెజార్టీ సంఖ్య‌లో ఎమ్మెల్యేలు అత‌ని మ‌ద్ద‌తుదారులుగానే ఉండ‌టం కూడా ఇక్క‌డ చిక్కులు తెచ్చిపెడుతోంది. సిద్ధూను ముఖ్య‌మంత్రిని చేస్తే దేశానికి ద్రోహం చేసిన‌ట్లేన‌ని, స‌రిహ‌ద్దుల్లో సైనికులు పోరాడుతుంటే సిద్దూ పాకిస్తాన్ వెళ్లి ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకుంటార‌ని, అత‌న్ని ముఖ్య‌మంత్రినిచేస్తే ఎట్టి ప‌రిస్థితుల్లోను స‌హించేదిలేద‌ని కెప్టెన్ హెచ్చ‌రించ‌డంతో అధిష్టానం కూడా మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. సీనియ‌ర్ నేత‌లు కూడా ఆ ప‌ద‌వి చేప‌ట్ట‌డానికి ముందుకు రావ‌డంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: