మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల వేడి ఇంకా త‌గ్గ‌లేదు. రోజురోజుకు పెరుగుతోంది. రాజ‌కీయ నేత‌ల‌క‌న్నా ధీటుగా మ‌న సినిమా తార‌లు రాజ‌కీయం న‌డుపుతున్నారు. మోహ‌న్ బాబు రాజ‌కీయం ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది. త‌న‌ను దుర్భాషలాడాడ‌ని, అత‌ని కొడుకు, కూతురు విష్ణు, ల‌క్ష్మిల‌ను తాను చిన్న‌త‌నం నుంచి ఎత్తుకొని తిప్పానంటూ బెన‌ర్జీ భావోద్వేగానికి గుర‌య్యారు. న‌టుడు త‌నీష్ కూడా అలాగే భావోద్వేగానికి గుర‌య్యారు. ఇక్క‌డ ప్ర‌ధానంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన అంశం మోహ‌న్‌బాబు రౌడీయిజం. నోటి దురుసుత‌నంతో ఎన్నిక‌ల్లో గెలిచామ‌న్న ఆనందం లేకుండా విష్ణుకు ఇబ్బందులు మోహ‌న్‌బాబు నుంచే ఎదుర‌వుతున్నాయ‌ని సినీ విశ్లేష‌కులు అంటున్నారు. ఎన్నిక‌ల కేంద్రంలో పెద్ద పెద్ద‌గా కేక‌లు వేయ‌డం తెలిసిందే. విష్ణు గెలిచిన త‌ర్వాత మోహ‌న్ బాబు త‌న ప్ర‌వ‌ర్త‌న మార్చుకోవ‌డం, బెన‌ర్జీపై చేయి చేసుకోవ‌డం వార్తాంశాల‌య్యాయి. ఇటువంటి తీరు ఉన్న వ్య‌క్తి అండ‌గా ఉన్న‌ప్ప‌టికీ విష్ణు మాను ఎలా న‌డుపుతాడో? ఎటువంటి స‌ల‌హాలిచ్చినా తీసుకునే ప‌రిస్థితి కూడా క‌న‌ప‌డ‌టంలేదు కాబ‌ట్టి రాజీనామా చేస్తున్నామ‌ని ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ త‌ర‌ఫున గెలిచిన 11 మంది ప్ర‌క‌టించారు. మ‌రి ఇప్పుడేం చేయాల‌నేది విష్ణుక‌న్నా మోహ‌న్‌బాబు చేతిలోనే ఉంది.మరింత సమాచారం తెలుసుకోండి:

maa