ఎండల్లో మాడిపోతున్న ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. భారత భూభాగం వైపు వేగంగా కదులుతున్న నైరుతీ రుతుపవనాల కారణంగా.. రాగల రెండు రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని  అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రం దక్షిణ ప్రాంతాలతో పాటు లక్షద్వీప్, మాల్దీవులపై ప్రస్తుతం పూర్తిగా ఆవరించినట్టు వెల్లడించిన ఐఎండీ.. బలమైన పశ్చిమ గాలుల తో రుతుపవనాలు వేగంగా కదులుతున్నట్టు స్పష్టం చేసింది. ఉపగ్రహ ఛాయాచిత్రాల ప్రకారం కేరళ తీరప్రాంతాలు, అరేబియా సముద్రంపై దట్టంగా మేఘాలు కమ్ముకున్నట్టు వెల్లడించింది. రెండు మూడు రోజుల్లోనే కేరళ భూభాగాన్ని నైరుతీ రుతుపవనాలు తాకే అవకాశముందని తెలిపిన ఐఎండీ.. నైరుతీ రుతుపవనాలు ఆగమనానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, యానాం లపై ప్రస్తుతం పశ్చిమ గాలుల ప్రభావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: