తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందాలని అందరూ అనుకుంటారు. కానీ రైతులకు మంచి చేసే వ్యాపారం చేయాలని కొందరు మాత్రమే అనుకుంటారు. అందులో మీరు కూడా ఒకరు అవ్వాలనుకుంటే మీరు ఈ బిజినెస్ ను ప్రయత్నిస్తే బెటర్..రసాయనాల వాడకం ఎక్కువైపోయింది. ఫలితంగా నానాటికీ భూసారం తగ్గిపోతుంటే... దిగుబడి పడిపోయి... రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యాపారంలో మీరు సేంద్రియ పదార్థాలతో ఎరువులు తయారుచేస్తారు. ఫలితంగా పర్యావరణానికీ, భూమికీ అంతా లాభమే జరుగుతుంది. రైతులకూ మేలు జరుగుతుంది.


అంతేకాదు... దిగుబడిలో ఎలాంటి పురుగుమందులూ ఉండవు.ఆ ఆహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రజలకూ మేలు చేసినట్లు అవుతుంది. దీన్ని ఎలా ప్రారంభించాలి.ఏయే అనుమతులు కావాలో తెలుసుకుందాం.ఆర్గానిక్ (సేంద్రియ) పదార్థాలతో పురుగుమందులు చేసే కంపెనీలు చాలా తక్కువ. మీరు చేసే ఎరువుల్లో రసాయనాలు ఉండవు కాబట్టి... మీ ఎరువులకు డిమాండ్ బాగా ఉంటుంది. మీరు సరిగ్గా వ్యాపారం చేస్తే.. భారీ లాభాలు పొంద వచ్చు..


కంపెనీని ప్రొప్రైటర్‌షిప్‌ కింద నమోదు చేయించుకోవాలి. అదే ఇతరులతో భాగస్వామ్యం కింద ప్రారంభించదలిస్తే, మీరు లిమిటెడ్ లయబులిటీ పార్ట్‌నర్‌షిప్ (LLP) లేదా Ltd. కంపెనీ కింద... కంపెనీస్ రిజిస్ట్రార్ (ROR) దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. మీరు వ్యాపారం ప్రారంభించేచోట నీటి సరఫరా ఉండాలి, వృథా నీరు పోయేందుకు డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి. కరెంటు సరఫరా సరిగా ఉండాలి. అలాగే రా మెటీరియల్ దగ్గర్లోనే లభించేలా చూసుకోవాలి. ఇక మీరు చేసే ఉత్పత్తులకు దగ్గర్లోనే మార్కెట్ ఉండాలా చూసుకోవాలి. ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్  చెప్పిన రూల్స్ పాటిస్తూ ఉత్పత్తిని చేపట్టవచ్చు.మీరు స్వయంగా రైతులకు అమ్ముకోవచ్చు. లేదా హోల్‌సేల్, రిటైల్ షాపులకు అమ్ముకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో ఒక వెబ్ సైట్ ను వాడుకొని అమ్ముకోవచ్చు.. అన్నీ ఖర్చులు పోగా ఓ 20 టన్నులకు ఈజీగా 50 వరకు లాభాన్ని పొందవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: