ఎల్.ఐ.సి.(భారత జాతీయ భీమా సంస్థ) ఐపీవో కు వెళ్తుందనే వార్తలు ఎప్పటి నుండో సామాజికంగా మాధ్యమాలలో హాల్ చల్ చేస్తున్నాయి. అయితే నిజానికి కూడా ఆ సంస్థ ఐపీవో కు సంసిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. దాదాపు నవంబర్ లో ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధం అవుతుంది సంస్థ. దానికోసం సెబీకి సమర్పించాల్సిన పత్రాలను ప్రస్తుతం సిద్ధం చేసుకునే హడావుడిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సంస్థను ఐపీవో కు తెచ్చేందుకు సాధన చేస్తున్నట్టు ఉన్నత అధికారి ఒకరు చెప్పారు. ఇప్పటికే దానికోసం కాలపరిమితి కూడా  నిర్ణయం అయిపోయినట్టు  ఆయన తెలిపారు.

ఇందుకోసమే సంస్థ నిబంధనలు-1956 లో మార్పులు కూడా చేసింది. స్టాక్ ఎక్స్చేంజి లో నమోదు కావడానికి అనువుగా ఆయా నిబంధనలను అనుసరించి బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను నియమించింది సంస్థ.  అలాగే సంస్థ చైర్మెన్ పదవి విరమణ వయస్సును నిబంధనలను కూడా మార్పు చేసింది. గతంలో ఈ వయసు నిబంధన 60 ఏళ్లుగా ఉండగా ఇప్పుడు దానిని 62 ఏళ్లకు పెంచింది. కేంద్రం కూడా ఐపీవో కోసమే పది మర్చంట్ బ్యాంకులను నిర్ణయించింది. ఇందులో గోల్డ్ మాన్ శాక్స్, సిటీ గ్రూప్, కోటక్ మహేంద్ర, ఎస్బిఐ కాప్స్, జేయం ఫైనాన్సియల్, యాక్సిస్ కాపిటల్, నోమురా, బోఫా సెక్యూరిటీస్, జేపి మోర్గాన్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లు ఉండనున్నాయి.  

ఈ ఐపీవో కోసమే న్యాయసలహాలు ఇచ్చేందుకు సిరిల్ అమర్ చంద్ మంగళ్ దాస్ ను నియమించింది సంస్థ.  విదేశీ మదుపరులు కూడా ఈ ఐపీవో లో పాల్గొనేందుకు ప్రభుత్వం ఏర్పట్లు చేయనుంది. సెబీ నిబంధనల ప్రకారం విదేశీ పోర్ట్ పోలియో మదుపర్లు(ఎఫ్.పి.ఐ.) ఐపీవో ద్వారా వీరు షేర్లు కొనుక్కునేందుకు అర్హులు. సాధారణ ఎల్.ఐ.సి లో మాత్రం దానికి అనుమతి లేదు. ఈ చిక్కుముడిని విప్పేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది.  సంస్థ నుండి ఈ ఏడాది 1.75 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకునేందుకు ప్రతిపాదన సిద్దమైన విషయం తెలిసిందే.  25వేలకోట్లకు రూ. 10 విలువ కలిగిన 2500 షేర్లను జారీచేయనుంది సంస్థ. ఒక్కసారి సంస్థ ఈ లిస్టింగ్ లో చేరితే 8-10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలిజషన్ తో ఎల్.ఐ.సి. అతిపెద్ద సంస్థగా నిలుస్తుంది. ఈ సంస్థ నిర్వహణలోనే ప్రస్తుతం 31.96 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: