ప్రేమను ప్రేమించిన వారు నమ్ముతుంటారు. ఎంత‌లా అంటే వారి కోసం ఏదైనా స‌రే ఇచ్చేంతలా ఒక‌రికొక‌రూ ప‌రిచ‌యం అయి కొద్ది రోజులు కాలం అయినా స‌రే ఒక‌రికోసం కోసం అన్ని ఇష్టాలు, క‌ష్టాలు ఇలా  ప్ర‌తీ ఒక్క‌టి మార్చుకోవ‌డం, పంచుకోవ‌డం జ‌రుగుతుంటాయి. మ‌రొక‌వైపు కొంత మంది ప్రేమించి వ‌దిలేసిన వారు ఎంద‌రో ఉన్నారు. అదేవిధంగా ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న వారు కూడా చాలానే ఉన్నారు. ప్రేమ అనేది ఎన్ని ర‌కాలుగా మార్చుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. కొంత మంది ప్రేమ గుడ్డిద‌ని, కొంత మంచిద‌ని ఇలా ఎవ‌రికీ న‌చ్చిన విధంగా వారు మాట్లాడుతూ ఉంటారు.

ముఖ్యంగా ప్రేమ మైకంలో త‌ప్పు అని తెలిసినా కొంద‌రూ మాత్రం చెడు దారులు తొక్కుతూ.. వారి అంద‌మైన జీవితాన్ని అంధ‌కారంలోకి నెట్టుకుంటూనే ఉన్నారు. అంతేకాదు.. వారిపైన ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న త‌ల్లిదండ్రుల‌కు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్ట‌ణంలో ఒక‌టి చోటు చేసుకున్న‌ది. మ‌ర్రిపాలెం గ్రీన్ గార్డెన్ ఏరియాకు యువ‌కుడు, హైద‌రాబాద్‌కు చెందిన ఓ యువ‌తి ప్రేమించుకుంటున్నారు. అయితే డ్ర‌గ్స్‌కు ప్రియుడు అల‌వాటు ప‌డ‌డంతో ప్రియుడి కోసం ప్రియురాలు హైద‌రాబాద్ నుంచి డ్ర‌గ్స్ తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నం చేసింది.

హైద‌రాబాద్ నుంచి వ‌స్తున్న యువ‌తి ద‌గ్గ‌ర డ్ర‌గ్స్ ఉన్న‌ట్టు టాస్క్ ఫోర్ఎస్ సిబ్బందికి ప‌క్కా స‌మాచారం తెలిసింది. విశాఖ‌లో స‌ద‌రు యువ‌తిని టాస్క్‌ఫోర్స్ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. త‌న ప్రియుడి కోసం మ‌త్తు ప‌దార్థాల‌ను యువ‌తి అక్ర‌మ ర‌వాణా చేస్తున్న‌ట్టు గుర్తించారు పోలీసులు. డ్ర‌గ్స్‌ను టాబ్లెట్ రూపంలో ఉన్న 18 పిల్స్‌, 2 ఎండీఏంఎల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా స‌ద‌రు యువ‌తితో పాటు ఆమె ప్రియుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు నిత్యం ఎన్ని జ‌రుగుతున్నాయో అని స్థానికులు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: