
వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఇంత చిన్న విషయానికే ప్రాణాలు పోతాయా అని ప్రతి ఒక్కరిలో ప్రాణ తీపి పెరిగిపోతోంది అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటిదే. ఎండాకాలంలో ఎండలు దంచి కొడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉపశమనం కోసం ఎంతోమంది ఏసీలు ఫ్యాన్లు వాడటం ఎక్కువ చేశారు. ఇక కొంతమంది చల్లని గాలిని ఇచ్చే కూలర్లను వాడటం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కూలర్ నుంచి చల్లటి గాలి రావాలి అంటే ముందుగా ఆ కూలర్ లో కొంత మొత్తంలో నీటిని నింపాల్సి ఉంటుంది.
ఇది కూలర్ వాడుతున్న ప్రతి ఒక్కరు చేసేది. కానీ ఇలా నీటిని నింపడం కారణంగా ప్రాణాలు పోతాయి అంటే ఎవరైనా నమ్ముతారా.. ఇక ఇటీవల ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ములుగు జిల్లా వాజేడు మండలం శ్రీరామ్ నగర్ లో విద్యుత్ షాక్ తో ఐటిబిపి జవాన్ మనోజ్ కుమార్ మృతి చెందాడు. ఇంట్లోని కూలర్లో నీళ్లు నింపుతుండగా.. కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న మనోజ్ ఇటీవల సెలవు పై ఇంటికి వచ్చాడు. ఇక అతని మరణంతో అటు కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.