ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అక్రమ మధ్యం రవాణా మాత్రం ఆగడం లేదు. పైగా కొత్త కొత్త దారుల్లో అక్రమార్కులు ఈ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో ముఖ్యంగా నాటు సారా సరఫరా అక్రమంగా విచ్చల విడిగా అవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ అక్రమ మధ్యానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. విచ్చల విడిగా అమ్రక మధ్యం ఏరులై పారుతోంది. ఇందులో నాటు సారా జోరు మామూలుగా లేదు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, ఒడిశా ల నుంచి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా మద్యం చేరుతోంది. అందులో నాటు సారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్ ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరో, పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తూనే ఉన్నారు.
అయినా ఈ అక్రమ వ్యాపారం మాత్రం ఆగడం లేదు. అందులోనూ గవర్నమెంట్ అధికారుల కారుల్లో నాటు సారా రవాణా జరుగుతుండటం ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది. ఓ తహసీల్దార్ కారులోనే అక్రమ సారా రవాణా జరిగింది. ఈ కారైతే పోలీసులు పట్టించుకోరని అక్రమార్కులు బాగానే ప్లాన్ అమలు చేశారు.. కానీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. విజయనగరం జిల్లా నుంచి అక్రమంగా నాటు సారాను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ నాటు సారా ఉన్న కారు కొమరాడకు చెందిన తహసీల్దార్ ప్రసాద్ ది. ఈ కారులోనే నాటు సారా అక్రమంగా రవాణా అవుతుండటం పలు  అనుమానాలకు దారి తీస్తోంది. అయితే ఈ నాటు సారాను పోలీసులు బొబ్బిలిలో వాహనాల తనిఖీలు చేస్తుండగా పట్టుకున్నారు. కాగా ఈ వాహనంపై తహసీల్దార్ స్టిక్కర్ ఉండటంతో పోలీసులే షాక్ అయ్యారు.

వెంటనే ఆ వాహనాన్ని నడిపే డ్రవర్ దుర్గాప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ కారులో 260 లీటర్ల నాటుసారాను ఒడిశా నుంచి తరలిస్తుండగా పోలీసులకు చిక్కింది. కాగా ఎమ్మార్వోకు తెలిసే ఈ నాటుసారా సరఫరా అవుతుందా.. లేదా అతనికి తెలియకుండానే అక్రమంగా ఈ నాటు సారాను సరఫరా చేస్తున్నారా అనే తీరులో బొబ్బిలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆంధ్రలో పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా నాటు సారా భారీ మొత్తంలోనే అక్రమంగా రవాణా జరిగింది. కాగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ విధంగా అక్రమంగా నాటుసారాను తరలిస్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సరిహద్దుల్లో పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. దాంతో అక్రమార్కులు వేరే వాహనమైతే ఖచ్చితంగా పోలీసులకు పట్టుబడతామని.. ఇలా అధికారుల వాహనాలను అడ్డుపెట్టుకుంటున్నారని పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: