తల్లి తండ్రులు పన్నెండు సంవత్సరాల క్రితం చనిపోవడం తో అనాధలైనటువంటి అక్క చెల్లెళ్లను చేరదీసాడు ఓ కామాందుడు. తెలంగాణ, భద్రాద్రి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 63 ఏళ్ళు ఉన్నటువంటి ఈ కామాందుడు సభ్యసమాజం తలా దించుకునేలా ప్రవర్తించాడు. తల్లి తండ్రులు చనిపోయిన తరువాత ఆ కవల పిల్లలకు అండగా ఉంటానని చెప్పి ఆ ఇద్దరినీ తన ఇంటికి తీసుకువెళ్లాడు. తీసుకు వెళ్లిన నాటినుండి వారిపై అఘాయిత్యం చేస్తూ వచ్చాడు. వారికీ ఆలా నరకం చూపిస్తూవచ్చాడు. అనాధలుగా మిగిలిన ఆ 8 సంవత్సరాల చిన్నారులు ఏం జరుగుతుందో తెలియక ఎదిరించలేక ఆ భాదను అనుభవిస్తూ వచ్చారు ఆ కవల అక్కాచెల్లెళ్లు. వయసుకు వచ్చిన ఆ అక్క చెల్లెల్లు తమపై జరుగుతున్న అఘాయిత్యం గురించి తెలుసుకున్నారు. అంతే ఆ కామాంధుడికి ఎదురు తిరిగారు.

పూర్తి వివరాలలోకి వెళ్తే . భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నగరం లో ఇద్దరు కవల అక్కాచెల్లెళ్లు తమ ఎనిమిదవ ఏటా తమ తల్లి తండ్రులను కోల్పోయారు . మేనమా అయినటువంటి మాల్ రెడ్డి కృష్ణ రెడ్డి అనే వ్యక్తి వారికీ అండగా ఉంటానని అతని ఇంటి కి తీసుకెళ్లాడు . ఆ చిన్నారులపై కన్నేసిన కృష్ణ రెడ్డి 12 సంవత్సరాలుగా వారిపై లైంగిక దడి చేస్తూ వచ్చాడు. వారికీ నరకం చూపించాడు. అయితే తమ చిన్నతనం లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని వారిద్దరూ కవలలు ఆ నరకాన్ని భరిస్తూ వచ్చారు. వారు ఇప్పుడు ఓ కాలేజీలో విద్యనభ్యసిస్తున్నారు.


వారి మేనత్త భర్త అయినటువంటి కృష్ట్ణ రెడ్డి పై  అక్క చెల్లెల్లు ఆ దాడికిసంబందించి ఎదురు తిరిగారు. తనపై ఎదురు తిరిగిన అక్కచెల్లెళ్లపై దాడి చేసాడు జరిగిన విషయం బయట చెబితే వారిని చంపి వారి ఆస్తిని కాజేస్తానని చెప్పాడు. ఒక్క సారిగా షాక్ కి గురైన అక్కాచెల్లెళ్లు ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్  కి  లిఖిత పూర్వకంగా అతడి గురించి లేఖ రాసారు. తమని కాపాడ మంటూ   విన్నవించుకున్నారు.  చలించిన ఎస్పీ వెంటనే  ఆ అక్కాచెల్లెళ్లను రక్షించారు. వారిని వెంటనే ప్రభుత్వ రక్షణ కేంద్రం కు తరలించారు. కృష్ణ రెడ్డి ని వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేసారు

మరింత సమాచారం తెలుసుకోండి: