రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఏ దేశం తరపున ఎంత మంది సైనికులు మరణించారు.  ఈ లెక్కల్లో అసలు వాస్తవాలు వెలుగు చూడటం లేదు. ఉక్రెయిన్ పై మాస్కో దండయాత్ర నెలన్నర రోజులుగా సాగుతోంది. రెండు వైపులా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంత మంది సైనికులు చనిపోయారనే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ దేశానికి ఆ దేశం తాము శత్రు సైనికులను పెద్ద సంఖ్యలో చంపామని చెప్పుకుంటున్నాయి. యుద్ధాల్లో ఇది సహజమే. తమ సైనికుల్లో ఆత్మ స్థైర్యం నింపేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేస్తుంటారు.


అయితే. ఇప్పుడు తొలిసారి రష్యా తన సైనికులను పెద్ద సంఖ్యలో కోల్పోయినట్టు అంగీకరించింది. ఉక్రెయిన్ పై దండయాత్రలో భారీ సంఖ్యలో తన  సైనికుల్ని కోల్పోయినట్లు రష్యా  ఒప్పుకుంటోంది. ఉక్రెయిన్ పై దాడిపై రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. తాము భారీ స్థాయిలో దళాల్ని కోల్పోయామంటున్నారాయన. ఇది చాలా విషాదక ర మని అన్నారు. త్వరలోనే తమ యుద్ధ లక్ష్యాలను అందుకోనున్నట్లు కూడా రష్యా ప్రతినిధి పెస్కోవ్  చెబుతున్నారు.


ఉక్రెయిన్‌తో జరిగిన పోరులో 1500 మంది వరకూ తమ దేశ సైనికులు మృతి చెందిన ట్లు రష్యా మార్చి 25న అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ యుద్ధ  మృతుల గురించి ఉక్రెయిన్ వాదన మరోలా ఉంది.. రష్యా దాదాపు 19వేల మంది సైనికుల్ని కోల్పోయినట్లు ఉక్రెయిన్  చెబుతోంది. యుద్ధంపై ఓ కన్నేసి ఉంచిన ప శ్చిమ దేశాలు మాత్రం అంత సీన్ లేదని చెబుతున్నాయి. వారు చెబుతున్నది ఏంటంటే.. యుద్ధంలో రష్యా సుమారు 7 వేల నుంచి 15 వేల మంది సైనికుల్ని కోల్పోయి ఉంటుందని అంటున్నాయి.


ఉక్రెయిన్ చెబుతున్న స్థాయిలో కాకపోయినా.. ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా కోల్పోయిన సైనికుల సంఖ్య తప్పకుండా 10 వేల పైనే ఉండొచ్చని అంచనా. ఆ స్థాయిలో ప్రాణ నష్టం ఉండటం వల్లనే రష్యా భారీ సంఖ్యలో సైనికులను కోల్పోయామని రష్యా అంగీకరించిందన్న వాదనలు ఉన్నాయి. మరి ఇందరిని బలి తీసుకున్న ఈ యుద్ధం చివరకు సాధించేదేంటో..?


మరింత సమాచారం తెలుసుకోండి: