బీఆర్‌ఎస్‌ తన తొలి ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించబోతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సభ ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది. ఈ సభకు అనేక మంది ముఖ్యమంత్రులను, జాతీయ స్థాయి ప్రముఖులను ఆహ్వానిస్తోంది. అయితే.. ఈ సభలో కేసీఆర్‌ ఓ సమస్యకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. విద్య విషయంలో సర్కార్ విధానం ఏమిటని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ప్రశ్నిస్తున్నారు. మూడేళ్ళుగా ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వకపోతే పేద విద్యార్థుల ఎలా చదువుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు.


రూ. 5,300 కోట్ల బకాయిలు ఇవ్వకుండా, చదువు అయిపోయిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఉంటే వారి భవిష్యత్ ఏమి కావాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి నిలదీశారు. మీ విద్యా విధానం పేదలను విద్యకు దూరం చేయడమేనా... కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని నీరు కారుస్తున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అంటున్నారు. పేద విద్యార్థులు చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతారని, చైతన్య వంతులు అయ్యి ప్రభ్యత్వాన్ని ప్రశ్నిస్తారని కేసీఆర్ ప్రభుత్వం భయపడుతుందని ఆయన విమర్శిస్తున్నారు.


టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ అని పెట్టుకొని ఖమ్మం లో సభ పెడుతున్న కేసీఆర్ పేదల విద్య గురించి, ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిల గురించి ఏమి చేప్తారో ప్రకటించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి డిమాండ్ చేశారు. మూడేళ్ళుగా ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు  బకాయిలు ఉండడం అంటే ఈ సర్కార్ కు అసలు విద్య పట్ల చిత్తశుద్ధి ఉందా అని మల్లు రవి ప్రశ్నించారు.


ఇలాగైతే... తెలంగాణ చేస్తున్న విద్య విధానమే బిఆర్ఎస్ పెట్టి దేశమంతా అమలు చేస్తారా  అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి నిలదీశారు. 18న ఖమ్మంలో బిఆర్ఎస్ సభ పెట్టెలోపు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ పెండింగ్ బకాయిలు అన్ని వెంటనే విడుదల చేయాలని మల్లు రవి డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో త్యాగాలు చేసిన విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వంపైన పోరాటం చేయడం పెద్ద కష్టం కాదన్నారు  మల్లు రవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs