ఇజ్రాయిల్ మళ్లీ పాలస్తీనాపై భారీ దాడులకు పాల్పడుతోంది. ఇకపై పాలస్తీనా లో ఇష్టారాజ్యం నడవదు. పాలస్తీనాలో రెచ్చిపోయే మూకలకు డబ్బులు చేరడం. పేరుకు ఒక ప్రభుత్వం ఉంటుంది. కానీ దాన్ని నడిపే వారు మాత్రం వేరే వారు ఉంటారు. అంటే ఎవరో కాదు తీవ్ర వాదులే. ఇప్పుడు అక్కడ విరక్తి చెంది చిన్న పాటి సమాచారం ఉన్నా పాలస్తీనా మీద దాడులు చేయడానికి ఇజ్రాయిల్ సిద్ధమవుతోంది.


కారణం నెతన్యాహు కాస్త మెత్తగా ఉన్నా మిగతా ఇజ్రాయిల్ నాయకులు అసలు తగ్గేది లేదంటున్నారు. బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఎటాకింగ్ కు సిద్ధమవుతున్నారు. పాలస్తీనా లోని గాజాలో తాజాగా చేసిన దాడుల్లో 9 మంది చనిపోయారు. దీంతో ఆ ప్రాంతం రక్తసిక్తమయింది. దీనిపై పాలస్తీనాలో ఉన్న వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. కానీ ఇజ్రాయిల్ చెబతుంది ఏమిటంటే అక్కడ ఏ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న వారిపైనా మా దాడి కొనసాగుతుంది. కచ్చితంగా వారిని మట్టుబెట్టడమే మా పని అని అంటోంది.


గతంలో భారత్ లో కూడా బుజ్జగింపు రాజకీయాల వల్లనే కశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. దీంతో ప్రజల్లో మార్పు వచ్చింది. కాంగ్రెస్ ను సాగనంపి భాజపాను అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే అక్కడ జరిగే దాడులను ఒక రకంగా అడ్డుకోవడానికి ఈ ప్రభుత్వం తోడ్పడుతుందని ప్రజలు ఆశించారు. భారత్ కు పాక్ నుంచి ఉగ్రవాదులను కశ్మీర్ కు ఎలా పంపిస్తారో.. వారికి శిక్షణ ఎలా ఇస్తారో గాజాలో కూడా ఇజ్రాయిల్ పై దాడులు చేయడమే లక్ష్యంగా తీవ్రవాదులు శిక్షణ తీసుకుంటారు.


దీన్ని పసిగట్టే ఇజ్రాయిల్ పదే పదే బాంబు దాడులు చేస్తుంటుంది. అందుకే ఈ మధ్య చేసిన క్షిపణి దాడిలో 9 మంది మృత్యువాత పడటం, దీంతో ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేశాయి. చూడాలి ఇది ఎంత వరకు దారి తీస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

war