
అమెరికాలోని తమ లాబీ ద్వారా చాలా గట్టిగా జో బైడన్ వర్గం మీద తమ ఎట్టి పరిస్థితుల్లోనూ ఐఎంఎఫ్ తో చెప్పించి డబ్బులు ఇప్పించమని ఒత్తిడిని తీసుకువస్తుంది. ఇంకోవైపు చూస్తే పాకిస్తాన్ సంబంధించిన తెహ్రిన్ కి తాలిబాన్ ఈ పాకిస్తాన్ దాడులు జరుపుతుందని ప్రపంచమంతా తెలుసు. కానీ ఏ దేశము సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఎందుకు రావట్లేదు అంటే పాకిస్తాన్ తయారు చేసిన తీవ్రవాదులను వేరే దేశపు వాళ్ళు వచ్చి పాకిస్తాన్ లో ఎలా అడ్డుకుంటారు. తాలిబన్లకు తీవ్రవాద శిక్షణ ఇచ్చేది పాకిస్తానే, అలా శిక్షణ తీసుకున్న తాలిబన్ల నుండి విడిపోయిన వర్గంగా ఉంటూ అదే తాలిబన్లకు పరోక్షంగా పనిచేసే వర్గమే తెహ్రిన్ కి తాలిబాన్ ఈ పాకిస్తాన్.
నిజమైన తాలిబన్లు పాకిస్థాన్ లో ఆశ్రయం తీసుకుని ఆ పాకిస్తాన్నే చెప్పు చేతల్లో తీసుకుని అదుపు చేయాలనుకున్నారు. అందుకోసం పాకిస్తాన్నే కబ్జా చేయడానికి తమలోని ఒక వర్గాన్ని పెట్టారు. ఇప్పుడు ఆ వర్గాన్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ ప్రపంచమంతటా సానుభూతిని పొందుదాం అనుకుంటే, తయారు చేసింది నువ్వే కదా అంటున్నారు. అమెరికా, యూరప్ దేశాల్ని ఆఫ్గనిస్తాన్ నుండి బయటకు పంపించేసి అంతా తన ఆధీనంలోకి వచ్చిందని చెప్పుదాం అనుకున్న పాకిస్తాన్ కి, అదే సమయంలో ఉన్న పాకిస్తానే పోయే పరిస్థితి వచ్చింది.