పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ తమ కార్యకర్తలలో ఉత్తేజం నింపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఆయన ఇటీవల పుంగనూరు వెళ్లి, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా లోకి వెళ్లి ఒక పోస్ట్ పెట్టారు. ఏదైతే, పి ఎల్ ఆర్ పేరుతో అక్కడ తిరుగుతున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా రవాణా గానీ  మైనింగ్ గాని జరగాలంటే దానికి గానూ వీళ్లకు సంబంధించిన  వెహికల్స్ మాత్రమే నడవాలట. అంత అరాచకం జరుగుతుందక్కడ అని ఆయన ప్రజలకు  చెబుతున్నారు.


అందుకే నిన్ను పాపాల పెద్దిరెడ్డి అంటారు అంటూ, పుంగనూరులో చిన్న గుంత పూడ్చడానికైనా, నియోజకవర్గంలో రోడ్డు వేయాల్సి వచ్చినా కూడా సొంత సంస్థ పి ఎల్ ఆర్ ప్రాజెక్ట్ చేయాలంట. అందుకు సంబంధించిన ప్రధానమైన ఉదాహరణ నియంత పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి లారీ ఇదీ అంటూ దాని ముందు సెల్ఫీ దిగి మరి చూపించారు లోకేష్. అదే సందర్భంగా అక్కడ జనాలు ఎవరూ రాకూడదని జారీ చేసిన రూల్ కూడా పక్కనపెట్టి అక్కడికి వచ్చిన జనాల్ని, ప్రత్యేకించి పుంగనూరులో మైనార్టీ వర్గం ఎక్కువ, అది కూడా పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా మారిన ముస్లింల జనాన్ని, వారి విజువల్స్ ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు.


దానితోపాటుగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి లోకేష్ ని ఆశీర్వదించారు. మైనార్టీ మహిళా యువనేత లోకేష్ కి రక్షాబంధనం కట్టి పాదయాత్ర కి సంఘీభావాన్ని ప్రకటించారు. అదే సందర్భంలో రాష్ట్రంలో మైనార్టీలం పడే ఇబ్బందులను, కష్టాలను చూసి నారా లోకేష్ యువ గళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారని ప్రకటించారు. ఇంకోవైపు భారీ ఎత్తున పుంగనూరులో పబ్లిక్ జమకూడడం, అక్కడ మరొక పార్టీకి అవకాశం లేని వేళ తెలుగుదేశం కూడా అక్కడ ధైర్యం చేయలేని ప్రాంతంలో లోకేష్ పాదయాత్ర దర్జాగా సాగింది. జనాల మొబలైజేషన్ కూడా అక్కడ గట్టిగానే ఉందని స్పష్టంగా కనిపిస్తుంది కూడా. మొత్తానికి పుంగనూరు లో లోకేష్ హంగామా బాగానే సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: