శ్రీరామనవవి వేడుకలు చేసుకుంటున్న సమయంలో ఆరు రాష్ట్రాల్లో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇండియాలోనే హిందువులు ఎక్కువగా ఉంటారు. వారి ఆరాధ్య పండలైన శ్రీరామనవమి, హనుమాన్ జయంతి లాంటి పండగలను వేడుకగా చేసుకుంటారు. ఊళ్లలో శోభాయాత్రలు తీసి పాటలు పాడుకుంటూ ఆనందంగా పండగ జరుపుకుంటారు.


అయితే ఈ మధ్య జరిగిన శ్రీరామ నవవి వేడుకల్లో కొన్ని అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఆ అల్లర్లలో చాలా ప్రాంతాల్లో విగ్రహాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. రాళ్ల దాడులు  జరిగాయి. హిందువులు ఎక్కువగా ఉండే దేశంలో కనీసం పండగలు కూడా చేసుకోలేకపోతున్నామని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.


ఈ దాడుల గురించి ఒపెక్ దేశాలు భారత్ పై విషాన్ని చిమ్మాయి. ఇండియాలో ముస్లింల పై దాడులు జరుగుతున్నాయని వాటిని ఆపాలని చెప్పాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ముందు క్షేత్ర స్థాయిలో ఏం జరిగిందో తెలుసుకోవాలని సూచించింది. ఎవరూ ఎవరిపై దాడులు చేశారు. ఎవరి పండగ రోజు విధ్వంసం జరిగింది. ఎక్కడ జరిగింది. ఎవరూ గాయపడ్డారు. పండగ రోజు ఇబ్బందులు పడింది ఎవరనేది ముందుగా తెలుసుకోవాలని హెచ్చరించింది. ఊరికనే బట్ట కాల్చి మీద వేస్తే ఊరుకునేది లేదని ఓఐసీ పై మండిపడింది.


ఇస్లామిక్ ఆర్గనైజన్ అనే పేరుతో ఇలాంటి రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాలని చెప్పింది. దేశంలో పండగల సమయంలో కావాలని చేస్తున్న దాడులను అడ్డుకోకుండా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చూస్తుంటే పుండు మీద కారం చల్లినట్లు ఒపెక్ దేశాలు చేసిన వ్యాఖ్యలు భారత్ ను ఆగ్రహానికి గురి చేశాయి. మరో సారి భారత అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చకుండా గట్టి వార్నింగే ఇచ్చింది భారత్. ప్రపంచంలో ఏ దేశంలో లేని స్వేచ్ఛ భారత్ లో ఉందని తెలుసుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు భారత్ చేసిన పని హర్షించదగినదేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: