
సిద్ధ రామయ్య వెంటనే అధిష్టానానికి చెప్పినా ఏం లాభం లేకుండా పోయింది. సిద్ధరామయ్య మీద బలమైన బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ నేతల్లో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. 20 ఏళ్లుగా బలమైన నేతగా ఉన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు అనుకున్న నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకపోవడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. రాబోయే ఎన్నికల్లో రెండో చోట్ల పోటీ చేయాలన్న సిద్ధ రామయ్య ఆశకు గండి కొట్టింది. సిట్టింగ్ స్థానం బాదామీ లో ఓటమి తప్పదని ఆయన కు సంకేతాలు వచ్చాయి. దీంతో కోలార్ తో పాటు వరుణ నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేశారు.
తొలి జాబితాలో కాంగ్రెస్ సిద్ధ రామయ్యకు వరుణ స్థానం నుంచి పోటీ చేయాలని ప్రకటించింది. శనివారం విడుదల చేసిన మూడో జాబితాలో కోలార్ కు కొత్త అభ్యర్థిని ప్రకటించి సిద్ధ రామయ్యకు షాక్ ఇచ్చింది. వరుణ నియోజకవర్గంలో ఎక్కువ లింగాయత్ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ సిద్ధ రామయ్య గెలవడం అనేది అంత సులువైన విషయం కాదు. కాబట్టి ఇక్కడ జేడీఎస్ అభ్యర్థిని బలహీనుడిని నిలబెడితే మాత్రం కాస్తయినా గెలిచే అవకాశం ఉంటుంది. వరుణ నియోజకవర్గంలో బలమైన బీజేపీ అభ్యర్థిని ఎదుర్కొని, లింగాయత్ ల ఓట్లు సాధిస్తేనే సిద్ధ రామయ్య గెలుపు సాధ్యమవుతుంది.