
కానీ వాటిని ఎవరూ ఇప్పటి వరకు తీసేసే సాహసం కూడా చేయలేరు. ఎందుకంటే వాటిని తీస్తే వారు అధికారంలో నుంచి దిగిపోతారు. అంతలా ప్రజల్లోకి ఆ పథకాలు చొచ్చుకెళ్లిపోయాయి. వాటికి అదనపు హంగులు కల్పించి ఇవ్వాలి తప్ప తీసేయలేరు. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జరుగుతోంది. దీనికి రాహుల్ గాంధీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కర్ణాటకలో రూ. 2 వేలు ప్రతి మహిళకు నెలకు ఒక్కసారి ఇస్తామని ప్రకటించారు.
200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, రూ. 3000 వేల రూపాయల నిరుద్యోగ భృతి డిగ్రీ పూర్తయిన ప్రతి విద్యార్థికి మూడేళ్ల పాటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ హామీ నిచ్చారు. ఇప్పుడు కర్ణాటకలో ఎక్కడికి వెళ్లిన కాంగ్రెస్ ఇస్తున్న హామీలు చర్చనీయాంశం అవుతున్నాయి. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అంటే ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇది చాలా వరకు సక్సెస్ అయ్యే పథకంలా కనిపిస్తోంది. రాబోయే ఆంధ్ర, తెలంగాణ ఎన్నికల్లో సైతం నాయకులు పోటీ పడి మరీ పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. ఉచిత పథకాల వల్ల ఇప్పటికే సోమరులు అవుతున్నారనే వాదన వినిపిస్తోంది. మరిన్ని ఉచితాలు ఎవరికి మంచి చేస్తాయో.. ఎవరిని గద్దె దించుతాయో చూడాలి.